Tuesday, May 12, 2026

*జిల్లాలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్* —————————————–

నేటి సాక్షి – జగిత్యాల (పూరెళ్ల బాపు )……………………………………జిల్లాలో వరి ధాన్యం సేకరణ, నిల్వలు మరియు మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉదేశ్యంతో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కొడిమ్యాల మండలంలోని చెప్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణేష్ ఇండస్ట్రీస్, లక్ష్మీ సరస్వతి ఇండస్ట్రీస్, లక్ష్మీనరసింహ ఇండస్ట్రీస్, శ్రీ లక్ష్మీ సాయి ఇండస్ట్రీస్‌తో పాటు నమిలికొండ గ్రామంలోని నరసింహ, ధరణి దత్త సాయి, చాముండి రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలించారు.*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ*కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు వస్తున్న వరి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా అన్‌లోడ్ చేసిన వెంటనే లారీలను త్వరితగతిన పంపించాలని మిల్లర్లను ఆదేశించారు. రైతులు మరియు రవాణాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం దిగుమతి, నిల్వ, మిల్లింగ్ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.మిల్లుల్లో ధాన్యం నిల్వలు, తేమ శాతం, మిల్లింగ్ సామర్థ్యం తదితర అంశాలను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు పనులు సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిల్లర్లు హమాలీలను అందుబాటులో ఉంచుకొని వచ్చిన ధాన్యాన్ని దింపుకోవాలని అలాగే మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు, అధికారులు సమన్వయం చేసుకొని కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ పరిశీలనలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, సివిల్ సప్లైస్ డిఎం జితేంద్ర ప్రసాద్ , తహసీల్దార్, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News