*నేటిసాక్షి, నల్లబెల్లి* సుమారు రెండు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న నయాబ్ తహసిల్దార్ నియామకాన్ని చేపట్టాలని తహసిల్దార్ ముప్పు కృష్ణ కు దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దళిత రత్న పరికి రత్నం బుధవారం వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….గత రెండు సంవత్సరాల నుండి మండల రెవెన్యూ కార్యాలయంలో నయాబ్ తాహసిల్దార్ లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా కలెక్టర్ కి ఈ సమస్యను పరిశీలించి నయా తహసిల్దార్ ని వెంటనే నియమించి సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముచింపుల ఉపసర్పంచ్ బొట్ల దయాకర్ మాదిగ, కొయ్యడ కుమారస్వామి, మంద నరేష్, పంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





