నేటి సాక్షి, చౌడాపూర్ (సురేష్ మోత్కూర్ )చౌడపూర్ మండల కేంద్రంలో భవిత సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్న చౌడపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాకలపల్లి శేఖర్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్. భవిత సెంటర్ శంకుస్థాపన స్థానిక కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ…. దివ్యాంగుల శిక్షణ కొరకు భవిత సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని దీనిని మండలంలోని దివ్యాంగులు అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నవీన్ ఉపసర్పంచ్ రాజు మండల ముఖ్య నాయకులు ఆత్మ కమిటీ డైరెక్టర్, మండల ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం, వివిధ గ్రామాల సర్పంచులు నారాయణ, రామాంజనేయులు, కొత్తపల్లి రఘు, మరికల్ శివకుమార్ మల్కాపూర్ వెంకటయ్య, చక్రపాణి రెడ్డి,యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాము మణికంఠ, గ్రామ ముఖ్య నాయకులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





