Friday, April 3, 2026

డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదాం

  • డ్రగ్స్ నియంత్రణకు డివైఎఫ్ఐ కృషి అభినందనీయం
  • బద్వేల్ ఎక్స్చేంజ్ సి.ఐ
  • పి. సీతారామిరెడ్డి

నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : 2025 మార్చి 21వ తేది నాడు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) కడప జిల్లా కమిటీ ముద్రించిన మాదక ద్రవ్యాల నివారణ పోస్టర్స్ ను డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బద్వేల్ మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఉన్న ఎక్స్చేంజ్ కార్యాలయం నందు ఎక్స్చేంజ్ సి.ఐ బి.సీతారామిరెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎక్సైజ్ సి.ఐ బి.సీతారామిరెడ్డి గారు మాట్లాడుతూ…. యువత మత్తు,మాధక ద్రవ్యాల వంటి జోలికి వెళ్ళవద్దని వాటికి దూరంగా ఉండాలన్నారు. యువత ఇటువంటి వాటి మోజులో పడి చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని,ఇప్పటికే జిల్లాలో గంజాయి మత్తుపదార్థాల వంటి వాటిని అరికట్టడానికి పోలీస్ మరియు ఎక్సేంజ్ డిపార్ట్మెంట్లు ఉక్కు పాదం మోపాయాని, యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా మంచి మార్గంలో నడిచి మంచి భవిష్యత్ వైపు అడుగులు వేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా నిర్మిద్దామని, యువత డ్రగ్స్ రహిత ఉద్యమంలో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. డ్రగ్స్ నివారణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న డివైఎఫ్ఐ యువజన సంఘానికి నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి మత్తు పదార్థాల వంటి వాటిని అమ్మినవారిపై కఠిన శిక్షలు అమలు చేయబడునని యువత తమ ఉజ్వాల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ఆ మాయలో పడవద్దని పిలుపునిచ్చారు.
డివైఎఫ్ఐ నాయకత్వం ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని భవిష్యత్తులో యువతకు అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించి యువతను చైతన్యవంతం చేయాలని కోరారు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ… యువతను డ్రగ్స్ మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాల వైపు నుండి మంచి మార్గం వైపు నడపడం కోసం డివైఎఫ్ఐ యువజన సంఘం అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి వంటి వాటికి యువత అలవాటు పడి నిండు జీవితాన్ని భావితరాల యువత నాశనం చేసుకుంటున్నారని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తే ఇటువంటి వాటిపైకి ఆలోచన ఉండదన్నారు. నిరుద్యోగ సమస్యతో యువత వలసలు పోతున్నారని మరికొందరు మొబైల్స్ లో పబ్జి లాంటి ఆన్లైన్ గేమ్స్ కు బానిస అవడం మరికొందరు మత్తు పదార్థాలకు బానిసవుతున్నారని, ఇది ఎక్కువగా ఈ మధ్యకాలంలో చదువుకుంటున్న విద్యాసంస్థల కేంద్రాలుగా డ్రగ్స్, గంజాయి వంటివి నడుస్తున్నాయన్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధితోపాటు యువత చెడు వ్యసనాల వంటి వైపు వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరం పాటు పడదామని దీనికి యువత మొత్తం కలిసి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సేంజ్ ఎస్.ఐ గౌస్ బాష, హెడ్ కానిస్టేబుళ్లు నారాయణరెడ్డి, గురయ్య, డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష- కార్యదర్శులు యస్.కె.మస్తాన్ షరీఫ్,యస్.కె.ఆదిల్, రూరల్ అధ్యక్షులు ముడుమాల ఓబుల్ రెడ్డి ,పట్టణ ఉపాధ్యక్షులు యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News