నేటి సాక్షి, వేమనపల్లి : మండలంలోని కల్లంపల్లి,సుంపుటం గ్రామ పంచాయతీలో జరుగుతున్న నర్సరీ,కాంపౌండ్ వాల్,పశువుల పాక పనులను శనివారం ఎంపీడీవో కుమార స్వామి పరిశీలించారు.పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తీ చెయ్యాలని కాంట్రాక్టరుకు సూచించారు.అలాగే వన మహోత్సవం కొరకు మొక్కలు సిద్ధం చేయాలని కార్యదర్శులకు సూచించారు.ఆయన వెంట ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి,ఏపివో సత్య ప్రసాద్,ఈసీ మధుకర్,పంచాయతీ కార్యదర్శులు సుదర్శన్,వెంకట్,సాంకేతిక సహాయకులు,క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.





