Friday, April 3, 2026

మెప్మా ఆర్పీ లకి 26 వేలు వేతనం పెంచాలి ఆర్పీ అండ్ వి ఓ ఏ ల రాష్ట్ర అధ్యక్షులు నరాటి ప్రసాద్ డిమాండ్

  • సిపిఐ ఏం.ఎల్.ఏ కునంనేని సాంబశివరావు కి మున్సిపల్ శాఖ కమిషనర్ శ్రీదేవి సెర్ఫ్ సీ ఈ ఓ దివ్య కి వినతి పత్రం అందించిన యూనియన్ నాయకులు

నేటి సాక్షి, హైదరాబాద్ :
25 ఏళ్ల నుండి వి ఓ ఏ లుగా ఆర్పీ లుగా స్వయం సహాయ సంఘాలకు సేవలు చేస్తున్న మహిళ కార్మికులుకి కనీస వేతనం ఇవ్వకుండా, పని చేసిన నెలలకు 4 నెలలు నుండి వేతనం ప్రభుత్వం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టటం ఏ మాత్రం సమంజసం అని ఆర్పీ & వి ఓ ఏ ల సంఘ రాష్ట్ర అధ్యక్షులు నరాటి ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం తో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రణాళిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షలు చిన్న రెడ్డి కి. సెర్ఫ్ సీఈ ఓ దివ్య కి, మున్సిపల్ శాఖ కమిషనర్ శ్రీదేవి ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో కలిసి విన్నపించటం జరిగింది. పట్టణ గ్రామీణ ఉపాది శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ దివ్య మేడం గారిని కలిసి ఆర్పీ అండ్ వి ఓ ఏ ల సమస్యలు. జీతం లు 4 నెలలు నుండి రావటం లేదు అని తెలపగా వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి తక్షణం వేతనాలు చెల్లించాలి అని ఆదేశం ఇచ్చారు. కొద్దీ నెలల్లో ఆర్పీ అండ్ వివోఏ వేతనం 15,600 రూపాయలు పెంచే ప్రతి పాధన ప్రభుత్వం చేస్తున్నది అని తెలిపారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నరాటి ప్రసాద్ దివ్య మేడం కి బ్యాంక్ లావా దేవి ల పై 1 శాతం కమిషన్ ఆర్పీ వి ఓఏ లకు ఇవ్వాలని ప్రతి పాదాన చెయ్యగ మంచి ఆలోచన అని అంటూ రానున్న రోజుల్లో బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టి 1 శాతం పర్సనటజ్ అందించే అందుకు కృషి చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు సీత మహాలక్ష్మి, మొగిలి సంధ్య, మంజుల, రాణి,లక్ష్మి, స్వరూప, జ్యోతి, సుభద్ర, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News