- నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం
- బిగుళ్ల మోహన్ బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు
నేటి సాక్షి, బెజ్జంకి: తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను విస్మరించిందని బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు బిగుళ్ల మోహన్ అన్నారు. ఈ సందర్బంగా మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న యూత్ డిక్లరేషన్ లో భాగంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలండర్, నిరుద్యోగ భృతి, యూత్ కమిషన్ ను ఏర్పాటు చేస్తామని హమీలు ఇచ్చారు. కానీ ఈ బడ్జెట్ లోనైనా నిరుద్యోగ యువతకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంతవరకు 4వేల రూపాయల నిరుద్యోగ భృతి కి నిధులు కేటాయిస్తారేమోనని ఆశలు పెట్టుకున్నారు. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా కూడా ఎన్నికల్లో ప్రధాన డిమాండ్ గా ఉన్న నిరుద్యోగ భృతి పదమే ఊసేత్తకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. పేరుకు మాత్రమే జాబ్ కేలండర్ ప్రకటించి షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ వెయ్యడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత సుమారు 35 లక్షల మంది ఉన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం పేరుతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులో పేరు ఉంటేనే అర్హులని చెప్పడం సరైనది కాదన్నారు. నూతన రేషన్ కార్డులను మంజూరు చేస్తామని చెప్పి ఇప్పటివరకు మంజూరు చేయలేదని, రేషన్ కార్డు లింక్ పెట్టకుండా రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హులైన నిరుద్యోగులు అందరికీ వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఉపాధి రంగానికి కేవలం 900 కోట్లు కేటాయించడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే బడ్జెట్ ను సవరించి నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలకై రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ రేటును దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా క్రీడా రంగానికి కేవలం 465 కోట్ల నిధులు సరిపోవని, ప్రతి గ్రామంలో, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తామని చెప్పినా ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం అందుకు అనుగుణంగా కేటాయింపులు చేయకపోవడం క్రీడాకారులను విస్మరించమేనని అన్నారు. యూత్ డిక్లరేషన్ హామీల ప్రస్తావనే లేకుండా బడ్జెట్ ను ప్రవేశపెట్టారని, యూత్ కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.





