- రోడ్డుకు అడ్డంగా నేలకొరిగిన చెట్లు..
- మరో రెండు రోజులు వానలు..
నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): గత కొన్ని రోజులుగా సూర్యుడితో విలవిలలాడిన చందుర్తి మండల ప్రజలకు శుక్రవారం కురిసిన వడగళ్ల వర్షంతో రైతన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన వరి పంట రాళ్ళ వానతో ధాన్యం నెలరాలింది. గత వారం క్రితం రైతులు రోజుకు రూ. 5 వేలతో ఖర్చుతో ట్రాక్టర్ ట్యాంకర్లతో పొలానికి నీరు అందించారు. ఇది ఇలా వుండగా శుక్రవారం కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
- రాళ్ల వాన, విరిగిన చెట్లు :

మండలంలో సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వేములవాడ – కోరుట్ల ప్రధాన రహదారైనా మల్యాల గ్రామంలో భారీ వర్షానికి చెట్లు నెలకొరగడంతో చెట్లను చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు. ఎస్సై అంజయ్య తొలగించి ట్రాఫిక్ జామ్ కి అంతరాయం లేకుండా పోలీస్ సిబ్బందితో కలిసి ప్రధాన రహదారిపై విరిగిపడిన చెట్లను తొలగించారు. ద్రోణి ప్రభావంతో మండల కేంద్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వడగండ్ల వానలు పడుతున్నాయి. పంట నష్టం జరిగే అవకాశం ఉందని వరి, మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.





