Friday, April 3, 2026

ఎలక్ట్రానిక్ పరికరాలు పరిమితంగా వాడాలి

  • డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య
  • విద్యార్థులకు కళ్ళద్దాల పంపిణీ

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలను పరిమితంగా వాడు కోవాలని హన్మకొండ జిల్లా డిఎం అండ్ ఎచ్ఓ డాక్టర్ అప్పయ్య సూచించారు. హసన్ పర్తి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల మరియు కళాశాల లోని కంటి చూపు లోపాలున్న సుమారు 60 మంది విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శుక్రవారం కళ్లద్దాలను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సెల్ఫోన్ టీవీ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా వినియోగించడం వలన కంటి చూపు మందగిస్తుందన్నారు ఎలక్ట్రానిక్ పరికరాలను పరిమితంగా వాడాలని విద్యార్థులకు సూచించారు కంటి చూపు ప్రాధాన్యత పోషకాహార ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు తెలిపారు కాలేజీ ప్రిన్సిపల్ పి సుధాకర్ కృష్ణ ఆర్.బి.ఎస్.కె నోడల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గాప్రసాద్ వైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి ఆప్తాలిక్ అధికారి మల్లారెడ్డి హెల్త్ సూపర్వైజర్ జి. మంజుల ఆర్ బి ఎస్ కే ఫార్మసిస్ట్ ఎస్ మాధురి ఏఎన్ఎం సిహెచ్ స్వప్న పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News