- కొలిపాక రాజు బిజెపి మండల అధ్యక్షులు
నేటి సాక్షి, బెజ్జంకి: నేటి యువత ప్రభుత్వ ఉద్యోగం దిశగా పయనించాలని,చంద్రశేఖర్ ను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు కృషి చేయాలని బిజెపి మండల అధ్యక్షులు కొలిపాక రాజు యువతకు పిలుపునిచ్చారు.మండల కేంద్రంలోని జడల చంద్రశేఖర్ టీఎస్పిఎస్సి ఫలితాల్లో హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్ గా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సంగ రవి యాదవ్,దొమ్మటి రాములు,వడ్లూరి శ్రీనివాస్,బండిపల్లి శ్రీను,గండ్ల శ్రీను,బొప్పెన అజయ్,తదితరులు పాల్గొన్నారు.





