Wednesday, April 15, 2026

గజ్వేల్‌లో రాజకీయ భగ్గుమంటలుకేసీఆర్–హరీశ్ రావు–కేటీఆర్ దిష్టిబొమ్మల దహనంఫోన్ టాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

నేటి సాక్షి గజ్వేల్….సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఇటీవల చేపట్టిన నిరసనకు ప్రతిగా కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.ఈ నిరసన కార్యక్రమం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట అంక్ష రెడ్డి సూచనల మేరకు నిర్వహించినట్లు తెలిపారు. గజ్వేల్ ఆత్మ కమిటీ డైరెక్టర్ గజ్వేల్ రామచంద్రం రెడ్డి మాట్లాడుతూ, అహ్మదిపుర్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఫోన్ టాపింగ్ వ్యవహారం ద్వారా రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలపై అక్రమ నిఘా పెట్టి లబ్ధి పొందారని ఆరోపించారు. వ్యాపార నేతల నుంచి భారీ మొత్తాలు వసూలు చేశారని, ప్రస్తుతం విచారణ ఎదురవుతున్న సమయంలో తమకు సంబంధం లేదని కేసీఆర్ చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు.ఫోన్ టాపింగ్‌లో అధికారులు కూడా భాగస్వాములేనని, తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలతో పాటు రాష్ట్రంలో జరిగిన పలు ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు టాప్ చేసి బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి పొందిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇప్పుడు నిర్దోషుల్లా మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పాపానికి ఎప్పటికైనా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్టుగానే ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు అందోల్ నరసింహులు, బాల్ గౌడ్, టెంట్ మల్లేశం, బోయిని రామచంద్రం, భొర్రణ బాల్ రాజు గౌడ్, శిల్వేరి అంజా గౌడ్, బుచ్చిరెడ్డి, కొత్తపల్లి వెంకట్ గౌడ్, ఆర్ముల రామచంద్రం, కనకరాజు, సంతోష్, బిక్షపతి, బాలయ్య, నరేందర్ రెడ్డి, బాలకిష్ట రెడ్డి, కుర్మ బిరయ్య, శ్రీనివాస్ రెడ్డి, కమ్మరి సత్తి, వైస్ ప్రెసిడెంట్ ఎర్ర కనకరాజు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News