Wednesday, April 15, 2026

*సింగపూర్ తెలుగు సమాజానికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో నేను బలపరుస్తున్న టీం శివప్రసాద్ కు ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించండి:- మీ టేకూరి నగేష్(అంతర్జాతీయ అవార్డు గ్రహీత

)* నేటి సాక్షి 06 ఫిబ్రవరి పాములపాడు పాములపాడు:- సింగపూర్ తెలుగు సమాజం సంఘానికి జరుగుతున్న ఎలక్షన్లలో టీం శివప్రసాద్ కు మీ అమూల్యమైన ఓటు వేసి, ఇతరులతో ఓటు వేయించి, అఖండ మెజారిటీతో గెలిపించాలని పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన అంతర్జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నగేష్ ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల తెలుగువారిని పేరుపేరునా కోరారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు & అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ నా పేరు టేకూరి నగేష్,నేను మీ అందరిలో ఒకడిని, అందరికీ మిత్రుడిని,గత 20 సంవత్సరాలుగా సింగపూర్‌లో నివసిస్తూ,అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటూ వచ్చానన్నారు.సింగపూర్ తెలుగు సమాజంలో, గత దశాబ్దానికి పైగా వివిధ పదవుల్లో పనిచేస్తూ,సేవే మార్గంగా సింగపూర్‌తో పాటు భారతదేశంలో కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనా వంతు సహాయ, సహకారాన్ని అందించానన్నారు.నా జీతంలో నుంచి ప్రతి నెల 16%ను సమాజ సేవకే వినియోగిస్తూ ఉంటానన్నారు.నేను మా పల్లెటూరు మొదలుకొని దేశ, జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు రాజకీయాలకతీతంగా, కుల మతాలకతీతంగా, మతసామరస్యంతో, మానవత్వంతో చేసిన అనేక సమాజ సేవ కార్యక్రమాలను గుర్తించి నాకు గౌరవ డాక్టరేట్ ను, వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు ను కూడా ప్రదానం చేయడం జరిగిందన్నారు.ఇప్పుడు, మీ అమూల్యమైన ఓట్లతో టీం శివప్రసాద్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా మా ప్యానల్ అభ్యర్థులకు కూడా ఓటు వేసి గెలిపించాలనిపేరుపేరునా అభ్యర్థిస్తున్నానని అన్నారు.కనుక ప్రతి ఒక్కరూ సింగపూర్ తెలుగు సమాజం సంఘానికి జరుగుతున్న ఎలక్షన్ లలో నేను బలపరుస్తున్న శివప్రసాద్ టీంకు మీ అమూల్యమైన ఓటు వేసి, ఇతరులతో ఓటు వేయించి మన తెలుగువారి యూనిటీకి పాటుపడాలని కోరారు.జై సింగపూర్ తెలుగు సమాజం – జై సింగపూర్ తెలుగు సమాజం అని నినాదాలు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News