నేటి సాక్షి చిలుకూరు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోరాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా రెండో రోజు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా చిలుకూరు వద్ద రహదారి భద్రతపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సమక్షంలో రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతివేగం ప్రమాదాలకు దారితీస్తుందని ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య ఎస్సై హనుమాన్ నాయక్. ఎంపీడీవో నరసింహారావు ఎమ్మార్వో ధ్రువ కుమార్. ఆర్ ఐ లు. శ్వేత సీతారాములు అఖిల పక్ష నాయకులు దళిత నాయకులు, తదితరులు పాల్గొన్నారు.అంబేద్కర్ ఆశయాలను ముందుంచుకుని ప్రజల ప్రాణ భద్రత కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.





