*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )బుగ్గారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2000-2001 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం రోజున పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ధర్మపురి నాని ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మరియు గురువులైనటువంటి శంకర్ రాధాకిషన్ పూర్ణచంధర్.విజయ్ కుమార్ సతీష్ కుమార్ చంద్రమౌళి వెంకట్ రమణ విజయ్ కుమార్ గణేష్.తదితర గురువులను ఘనంగా ఆహ్వానించుకొని, వారికి పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీచర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు తమ అనుభవాలను నెమర వేసుకొని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు చేసుకొని, ఒక్కరు గొప్ప స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు.





