నేటి సాక్షి నారాయణపేట, మే,10, (రిపోర్టర్ ఇమామ్ సాబ్), తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న ప్రజాపాలన లో భాగంగా చేపట్టిన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో మొదట తెలియచేసిన విధంగా ఒక లక్ష పదివేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందెందుకు డి పి ఆర్ తయారుచేశారు.అందులో మన ధన్వాడ మండలానికి సంబంధించి కేవలం అత్యల్పంగా పదివేల ఎకరాల ఆయకట్టు కు సాగు నీరు అందే విధంగా ఆ యొక్క ప్రాజెక్టు డిజైన్ చేశారు.. ఇట్టి క్రమంలో మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి. డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి మరియు మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ.కుంభం శివకుమార్ రెడ్డి ధన్వాడ మండలానికి అన్యాయం జరుగుతుందని భావించి ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి తో చర్చించి జాయమ్మ చెరువు కు వెళుతున్న నీటిని ధన్వాడ పెద్ద చెరువుకు తరలించి నీటితో నింపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం ధన్వాడ పెద్ద చెరువు పరిస్థితి చిన్న పాటి వర్షానికే పూర్తిగా నిండి రోడ్డు వరకు నీరు వస్తున్నాయి. గత రెండు సంవత్సరాల నుండి పూడిక తీస్తే ఈమాత్రమైన నీరు నిలిచి నేటికీ ఇంకా నీటి నిల్వ ఉన్నది. చెరువు కింద గల రైతులకు నీటి ఏద్దడి లేకుండా పంటలు పండించుకొనుచున్నారు. అదేవిధంగా ఎండ తీవ్రత అత్యధికంగా ఉన్నా నీటి నిల్వ ఉండటం వలన పశువులకు తాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నది. అదేవిదంగా ముదిరాజ్ సోదరులు వదిలిన చేపలు సైతం చెరువు లో నీరు ఇంకా ఉండటం వలన వాటి బరువు పెరిగి రేటు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది.చెరువు ఈ సారి మాత్రమే పూడిక తీసే అవకాశం ఉంది.ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో వచ్చే సంవత్సరానికి ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు జరుగుచున్నవి.చెరువు భారీ స్థాయిలో పూడిక తీసి పూర్తి స్థాయిలో చెరువు నింపడం వలన సంవత్సరాంతం నీటి నిల్వ నిండు కుండ లా ఉంటే ముదిరాజ్ కుల బంధువులు ఎక్కువ మొత్తం లో చేపలు వదిలి ఎక్కువ కాలం పెంచితే మార్కెట్ లో మంచి రేటు వచ్చి యావత్ ముదిరాజ్ లందరు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంది.గతం లో కూడా మత్స్య సహకార సంఘం ద్వారా చెరువు పూడిక తీత కు ప్రభుత్వ అధికారులకు తెలియచేయడం జరిగినది.ధన్వాడ పెద్ద చెరువు నింపడం వలన క్రింద ఉన్న చెరువులను కూడా నింపే అవకాశం ఉంది. అదే విధంగా గ్రౌండ్ వాటర్ పెరిగి సమీప రైతుల పొలాల్లో వేసుకున్న బోర్లు రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది.చెరువు నిపడం వలన అన్ని విధాలుగా లాభదాయకం కాబట్టి ప్రభుత్వ ఆదాయానికి లాభం చేకూరుస్తూ ఇరిగేషన్ అధికారుల అనుమతితో పూడిక తీస్తున్న వారిని అడ్డుకోవడం చెరువు కింద గల గ్రామాల చెరువులకు, రైతులకు,ముదిరాజ్ జాతికి తీవ్ర అన్యాయం జరుగుతున్నట్టు భావన.కావున జిల్లా కలెక్టర్ గారు మరియు ఇరిగేషన్, రెవిన్యూ, పోలీస్ ఇతరత్ర ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ధన్వాడ పెద్ద చెరువు పూడిక తీసి పూర్తి స్థాయిలో నీటిని నింపగలరని మనవి. ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షులు శ్రీ నీరటి నర్సిములు నాయుడు, ధన్వాడ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నారాయణ, కాబోయే మత్స్య సహకార సంఘం అధ్యక్షులు శ్రీ. అచ్చుబాబు, కావలి నరహరి, సంద లక్ష్మయ్య, వెంకటయ్య, సంద బాలరాజ్, సిపిఎం వెంకన్న,టప్ప భాస్కర్, కురుమూర్తి, విష్ణు, నీరటి బాబా, అనిల్ తదితరులు పాల్గొన్నారు.





