Tuesday, April 21, 2026

*ఆంధ్రప్రదేశ్ మంత్రులకు సింగపూర్‌లో ఘన స్వాగతం పలికిన సింగపూర్ లో ఉన్న తెలుగు అసోసియేషన్ వారు*

నేటి సాక్షి 21 ఏప్రిల్ పాములపాడు:- నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజవర్గం, పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత & తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు సింగపూర్‌ దేశానికి మూడు రోజుల శిక్షణ కొరకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులకు మా హృదయపూర్వక మరియు ఘన స్వాగతం పలకడం జరిగింది.ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు & అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు ప్రత్యేక శిక్షణ కొరకు సింగపూర్ కు వచ్చిన కింజారపు.అచ్చెన్నాయుడు(వ్యవసాయం, పశుసంవర్ధక, పాల అభివృద్ధి మరియు మత్స్యశాఖల మంత్రి), పొంగూరు.నారాయణ(మునిసిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖల మంత్రి), వంగలపూడి.అనిత(గృహ వ్యవహారాలు మరియు విపత్తు నిర్వహణ ల శాఖ మంత్రి), సత్య కుమార్ యాదవ్(ఆరోగ్యం, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి),అనగాని సత్య ప్రసాద్ (రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంపుల శాఖల మంత్రి), బి.సి.జనార్ధన్ రెడ్డి(రాష్ట్ర రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖల మంత్రి), మంత్రివర్యులను కలుసుకుని అందరికీ పుష్పగుచ్చాలు చేతికి అందించి ఘనంగా ఆత్మీయ స్వాగతం పలకడం జరిగింది. వారి యోగక్షేమాల గురించి, కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందనీ అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News