నేటిసాక్షి, మిర్యాలగూడ : ప్రస్తుత వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా, నియోజకవర్గ ప్రజల మరియు బాటసారుల సౌకర్యార్థం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని 7ప్రధాన కూడలుల వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ,ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ లు ప్రారంభించి, ప్రజలకు, బాటసారులకు త్రాగునీరు పంపిణీ చేశారు. అనంతరం బిఎల్ఆర్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 3వేల మందికి పంపిణీ చేసే ఉచిత పెరుగన్నం పంపిణీ 9వ రోజు కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని, పెరుగన్నం పంపిణీ చేసి, ప్రజలు మరియు నాయకులతో కలిసి పెరుగన్నం తిన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “పెరుగుతున్న ఎండల దృష్ట్యా సామాన్య ప్రజలు, ప్రయాణికులు మరియు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి దాహం తీర్చేందుకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే బిఎల్ఆర్ పట్టణంలోని ప్రధాన కూడలిల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా, పట్టణంలో ప్రతిరోజు 3 వేల మందికి ఉచిత పెరుగన్నం పంపిణీ చేయడం చాలా అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.





