Tuesday, April 21, 2026

*బీసీల్లో పద్మశాలీలను రాజకీయంగా ఎదగకుండా చేసే కుట్రలో భాగమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వేలో పద్మశాలీల జనాభాను తగ్గించి చూపిన సర్కార్*

నేటి సాక్షి ఏప్రిల్ 21 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ తెలంగాణలో పద్మశాలీలను రాజకీయంగా, సామాజికంగా అణిచివేసేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారని , పాలకుల కుట్రలను తిప్పి కొట్టకపోతే పద్మశాలీ సమాజ ఉనికి కె ప్రమాదమని ఈ రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కుల గణన నివేదిక పద్మశాలీలపై వివక్ష పూరితంగా ఉందని, ఈ సర్వే ముమాటికి తప్పుల తడాఖా అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో రాష్ట్రంలోని పద్మశాలి సమాజానికి తీవ్ర అన్యాయం జరిగిందని , గతం లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2015 లో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలు రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలీలు 18 లక్షల జనాభా ఉందని ప్రకటిస్తే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కుల గణన సర్వేలో పద్మశాలీలను కేవలం 11,79,031 లక్షలుగా చూపెట్టినారు. అంటే 3.3 శాతం గా ప్రకటించడం పట్ల పద్మశాలి సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 11 ఏళ్లలో పద్మశాలి జనాభా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగింది కానీ ఆరు లక్షలకు పై చిలుకు పద్మశాలీల జనాభాను తగ్గించి కుల గణన సర్వేలో చూపించడం అంటే ఇది పూర్తిగా బీసీల పట్ల పద్మశాలీల రాజకీయంగా, సామాజికంగా అనుగదొక్కే ప్రయత్నం గా నే మేము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం మా జనాభాను తక్కువగా చూపిస్తుందని వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి జనాభా 30 లక్షల నుండి 35 లక్షల జనాభా ఉందని గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2015 లో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 18 లక్షలు ఉన్న మా జనాభా కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేలో 11,79,031 లక్షలకు ఎట్లా మా పద్మశాలి జనాభా తగ్గినదో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేసినారు. ఈ 6 లక్షల మంది బాంబే , సూరత్ , దుబాయి తదితర దేశాలకు వెళ్లిపోయారా లేదా వారు చనిపోయారా అనే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రం లో పద్మశాలీయులే కాక 19 ఉప కులాలు ఉన్న వారి వాటి సర్వే లెక్కల ఊసే లేకపోవడం అంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోని ఈ సర్వే నిర్వహించిందో ఈ ప్రభుత్వ నిర్వాహకాన్ని ప్రజలు , ప్రజాసమిక వాదులు అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేసినారు. పద్మశాలీయుల జనాభా ఎక్కువగా చూపిస్తే ఎక్కువ సీట్లు , ఎక్కువ నిధులు ఇవ్వాల్సి వస్తుందని అగ్ర వర్ణాలే అధికారం కోసం పద్మశాలి సమాజాన్ని ప్రభుత్వం బలిపెట్టినదని మండిపడ్డారు. రాష్ట్రం లో ప్రజాస్వామ్య బద్దంగా కుల గణన తిరిగి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ లు గా , పద్మశాలి సంఘాలుగా డిమాండ్ చేసినారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, మూడు తరాల ఉద్యమ నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి తో పద్మశాలి సమాజానికి జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలు చేయాలని, రాజకీయాలకు అతీతంగా పద్మశాలీయులు ఏకమై సామాజిక న్యాయం కోసం రాజ్యాధికారం లో వాటా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క సమావేశం లో తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక, రాష్ట్ర బీసీ సంఘాల నాయకుడు , శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, ఉపాధ్యక్షుడు జంజీరల నారాయణ , కార్యదర్శి అడిచర్ల రాజేశం, కోశాధికారి పరిసె శ్రీను , పద్మశాలి , బీసీ సంఘాల జిల్లా నాయకులు బొడ్డున బాపు రావు , దేవులపల్లి రామస్వామి , సత్యనారాయణ , సి హెచ్ రామస్వామి , అశోక్ వేముల , ఎం రామదాస్ తదితరులు పాల్గొన్నారు.జై తెలంగాణ జై బీసీ జై పద్మశాలి జై మార్కండేయ జై జై మార్కండేయ అని పెద్ద పెట్టున నినాదాలు చేసారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News