నేటిసాక్షి, మిర్యాలగూడ : ఆడపలబిడ్డను కాపాడుకోవడం మనందరి బాధ్యతని అర్భన్ సిడిపిఓ మమత అన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సిడిపిఓ మమత ఆధ్వర్యంలో మంగళవారం మండల స్థాయి “బేటి బచావో బేటి పడావో” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అర్భన్ సిడిపిఓ మమత మాట్లాడుతూ, “బేటి బచావో-బేటి పడావో” కార్యక్రమంలో ఆడపిల్లలను కాపాడుకోవడం అందరి బాధ్యత అని, ఆడపిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు కల్పిస్తుందని, ఆడపిల్లలకి ఎలాంటి ఆపద వచ్చినా అక్కున చేర్చుకోవడానికి బాలసదనాలు ఉన్నాయని అన్నారు. ఆడపిల్లలు వద్దు అనుకున్న వాళ్లు ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటుచేసిన ఉయ్యాలలో వేయగలరని, అంతేగాని అక్రమ దత్తత ఇవ్వకూడదు అని తెలియజేశారు. అనంతరం తహశీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ, బాలలకి భద్రత కల్పించాల్సిన బాధ్యత అందరి పైన ఉందని, అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేసినట్లైతే సమస్యలను తగ్గించగలుగుతాము అని తెలియజేశారు. అనంతరం ఎంపిడిఓ శేషగిరి శర్మ మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన బాలల పరిరక్షణ కమిటీలు పర్యవేక్షణ చేస్తూ, గ్రామాలలో ఆడపిల్లల చదువు గురించి ఆడపిల్లల భద్రత గురించి, అక్రమ దత్తత గురించి డ్రాప్ ఔట్ కాకుండా, అందరూ చదువుకోవాలని, బాల్య వివాహాలు చేసుకోకూడదని అందరూ చదువుకొనేల చూడాల్సిన బాధ్యత మనందరికీ ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ మొయినుద్దీన్, మండల విద్యాధికారి ధర్మానాయక్, ఏపీఎం దిలీప్, నిజాముద్దీన్, కార్మిక అధికారి శేషారత్నం, జిల్లా బాలల పరిరక్షణ విభాగం రమనీ, పోలీసు శాఖ నుండి పిసి ఉషా , అరుణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ లు రాధిక, వాణి, నిహారిక తదితరులు పాల్గొన్నారు.





