నేటి సాక్షి 18 ఏప్రిల్ పాములపాడు:-ఓ కేసు నిమిత్తం పాములపాడు స్టేషన్ కు నన్ను పిలిపించగా నాకు 41 కింద నోటీసులు ఇచ్చి పిలవ వలసిందిగా కోరగా నాపై రూరల్ సిఐ- ఎం.సురేష్ కుమార్ రెడ్డి దాడి చేశాడని సోషల్ వర్కర్ కలబండి నాగరాజు డిఎస్పి- ,, ఆర్.రామాంజీ నాయక్ ఫిర్యాదు చేశారు. బాధితుడు సోషల్ వర్కర్ కలబండి.నాగరాజు మాట్లాడుతూ ఒక కేసు నిమిత్తం నోటీసులు తీసుకోవాలని పాములపాడు పోలీస్ స్టేషన్ కు పిలిపించి నాపై దాడి చేశారని తెలిపారు. సీఐ దాడి చేయడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండటంతో కుటుంబ సభ్యులు. 108 అంబులెన్స్ లో స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధమ చికిత్స చేయించుకొని, ఇక్కడ ఆక్సిజన్ లేనందున ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న తర్వాత సమత సైనిక్ దళ్ జిల్లా ఉపాధ్యక్షుడు సగినాల.సురేష్, తదితర ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆత్మకూరు డి.ఎస్.పి- ఆర్. రామాంజీ నాయక్ కి నాపై దాడి చేసిన విషయాన్ని తెలియపరచి, ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.





