నేటి సాక్షి నారాయణపేట, ఏప్రిల్ 18, (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కరాటే పేరుతో డబ్బులు వసూలు చేయడం జరిగిందని, మరికల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా స్థాయి అధికారులతో విచారణ జరిపించాలని నారాయణపేట జిల్లా ఎన్ఎస్ యూ ఐ నాయకులు అన్వర్ సాదాత్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం మరికల్లో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ మరికల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలపై తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ యూ ఐ అధ్యక్షుడికి ఇట్టి విషయంపై ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఎన్ఎస్ యూ ఐ నాయకుల పై కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు. బెదిరింపులకు భయపడేది లేదని ఆయన వివరించారు. ఇట్టి విషయంపై ఎన్ఎస్ యు ఐ ఆధ్వర్యంలో త్వరలోనే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.





