నేటి సాక్షి, మునగాల ( పాముల రాఘవేందర్ ) మునగాల పరగణంలో నరసింహుల గూడెం గ్రామ సమీపంలో హై స్కూల్ సుమారు ఆరు దశాబ్దాల కాలం నుంచి విద్య బోధనలు నేర్పిన పాఠశాల కన్నీరు పర్వంతో పూర్వ విద్యార్థులను వేడుకుంటుంది.. నా బిడ్డల్లారా మీకు చెట్ల నిచ్చాను… గుట్టనిచ్చా.. మీకు ఆహారం కోసం సీతాఫలాలు ఇచ్చాను… త్రాగటానికి కొల్లేటి సరస్సును ఇచ్చాను.. మీ ఆట పాటల కోసం నా హృదయాన్ని ఇచ్చాను.. మీ మొక్కుల కోసం దేవుణ్ణి ఇచ్చాను ను.. దోషడు గులాబి పువ్వులతో చేతులు చాచి వేడుకుంటున్నాను..రేపాల, నరసింహుల గూడెం, సీతానాగారం, తండా, విజయరాఘవపురం, కేశాపురం, జగన్నాథపురం, కరివీరాల, కలుకోవా, మాధవరం గ్రామాల పూర్వ విద్యార్థులారా… ఒకప్పుడు మీకు అక్షరాల బాట చూపించిన ఆ పాఠశాల నేడు మీ ముందుకు ఆవేదనతో మొరపెడుతోంది.“నా నీడలో చదివి మీరు ఎంతోమంది ఉన్నత స్థానాల్లోకి ఎదిగారు. మీ విజయాలే నాకు గర్వకారణం. కానీ ఇప్పుడు నన్ను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. కొత్త పాఠశాల భవనం వచ్చిందని నన్ను పూర్తిగా మరిచిపోయారా?” అంటూ ఆ పాఠశాల ప్రశ్నిస్తోంది.చెట్లు, మొక్కలు పెరిగి భవనం క్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు లేకుండా ఎండలోనూ, వానలోనూ గోడలు కుళ్లిపోతూ తన దుస్థితిని తెలియజేస్తోంది. ఒకప్పుడు పిల్లల నవ్వులతో మార్మోగిన ఈ విద్యాలయం నేడు నిశ్శబ్దంగా మారిపోయిందని వేదన వ్యక్తం చేస్తోంది.ప్రతి ఏడాది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరకు వచ్చే పూర్వ విద్యార్థులు ఒకసారి ఈ పాఠశాలను దర్శించాలని కోరుతోంది.“మీరు జాతరకు వస్తుంటారు కదా… నేను ఇప్పటికీ మీకు నీడనిస్తాను. ఒకసారి రండి… నన్ను ఈ శిథిల స్థితి నుంచి కాపాడండి” అంటూ వేడుకుంటోంది.అలాగే పూర్వ విద్యార్థులు చెయ్యి చెయ్యి కలిపి ఈ పాడైపోతున్న పాఠశాలను మరమ్మతులు చేసి, మళ్లీ పాత కాంతిని తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కొద్దిపాటి సహాయం, చొరవతో ఈ భవనాన్ని పునరుద్ధరించవచ్చని చెబుతోంది.“మీరు ఆశ్రయం పొందిన ఈ విద్యాలయాన్ని కాపాడండి… మళ్లీ జీవం పోయండి. మీ సేవకు నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను” అంటూ పూర్వ విద్యార్థులను మనవి చేస్తుంది. రండి.. కదిలి రండి.. మీ ముందడిగే నా భవిష్యత్తు.. నా కన్నీరుని ఆర్పుతారని.. నా కష్టాన్ని తీర్చుతారని వేడుకుంటూ. అయ్యా! మీ విద్యాలయం.





