Saturday, April 25, 2026

పాఠశాల కు టెలివిజన్ బహుకరించిన లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల

మహిళా లయన్స్ క్లబ్ అయిన కోరుట్ల కోటి నవ దుర్గ వారి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం క్లబ్ అధ్యక్షురాలు లయన్ పోతని శ్రీ లత స్వయంగా పాఠశాలకు వచ్చి ఆండ్రాయిడ్ టెలివిజన్ ను శుక్రవారం అందివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు అయిన లయన్ పోతని శ్రీ లత మాట్లాడుతూ ఇలాంటి శిశు మందిరాలు ఎంతో అభివృద్ధి చేయాలని, వీటిలో చదువులతో పాటు మన దేశ సంస్కృతి సంప్రదాయాలతో బాటు దైవ భక్తి మరియు దేశ భక్తి కూడా నేర్పిస్తారని మన దేశానికి ఉత్తమ పౌరులను అందించడంలో ఎంతో ముందుంటారని పేర్కొనడం జరిగింది.
అలాగే ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ మాజీ జిల్లా గవర్నర్ లయన్ అనంతుల శివ ప్రసాద్ మాట్లాడుతూ సదాచారం తో కూడిన విలువలు కూడిన విద్యను అందిస్తూ శిశు మందిరాలు ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుతూ దేశ అభివృద్ధిలో భాగం చేస్తున్నారని కొనియాడారు.
అలాగే రెండవ ఉప జిల్లా గవర్నర్ గా ఎన్నికైన లయన్ గుంటుక చంద్ర ప్రకాశ్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, ఎంతో మంది ఉన్నత విద్యావంతులను, దేశ భక్తులను తయారు చేస్తున్న ఇలాంటి పాఠశాలకు మా వంతు బాధ్యతగా భవిష్యత్లో కూడా అండగా ఉంటామని చెప్పడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో పూర్వ విద్యార్థి, ప్రస్తుత పాఠశాల సలహా సమితి సహా సంయోజకులు ప్రస్తుత లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ అయిన పోతని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ తన వంతు కృషి ఉంటుందని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అని చెప్పారు.
ఇట్టి కార్యక్రమంలో జోన్ చైర్మన్ ఆడెపు కమల, మాజీ జోన్ చైర్మన్ అల్లాడి శోభ మరియు జిల్లా నాయకులు మరో పూర్వ విద్యార్థి లయన్ అల్లాడి ప్రవీణ్ ,మాజీ రీజనల్ చైర్మన్ ఆడెపు మధు, కాబోయే రీజినల్ చైర్మన్, పూర్వ విద్యార్థి లయన్ గుంటుక సురేష్ బాబు,మహిళా లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్ష కార్యదర్శులు లయన్ వనపర్తి రమ్య, లయన్ కుందారపు ప్రేమలత పాల్గొన్నారు .
పాఠశాల కోశాధికారి నీలి శ్రీనివాస్ మాట్లాడుతూ క్లబ్ తరపున ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ, ఇలాంటి పాఠశాల అభివృద్ధిలో కూడా క్లబ్ తరపున సేవలు అందిస్తున్నందుకు అందరికీ పాఠశాల ప్రబంధ కారిణి మరియు సమితి పక్షాన ధన్యవాదాలు తెలియ చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News