Tuesday, May 12, 2026

పోక్సో కేసులో బండి సాయి భగీరథ ను (నిందితుడిని )వెంటనే అరెస్ట్ చేయాలి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీజ్యోతిబీమ్ భరత్శంకర్‌పల్లి: మే 12:

( నేటి సాక్షి):పోక్సో కేసులో బిజెపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ పై 17 సంవత్సరాల అమ్మాయి పై లైంగిక వేధింపుల కేసులో కేసు నమోదు అయిన మూడు రోజులు గడిచినా ఇప్పటివరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం పట్ల రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీజ్యోతిభీమ్ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ మూడు రాజులుగా బాధిత కుటుంబం న్యాయం కోసం తిరుగుతున్నా పోలీసులు కేసును పట్టించుకోలేదని ఆరోపించారు.బాధితురాలి కుటుంబాన్ని రాజకీయ ప్రభావంతో బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. చట్టం ముందు అందరూ సమానమైతే, పోక్సో వంటి తీవ్రమైన కేసులో ఆలస్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ సంబంధాలు, ఒత్తిళ్లు కారణంగా కేసు దర్యాప్తు ఆలస్యం అవుతోందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. పిల్లల భద్రతకు సంబంధించిన కేసుల్లో రాజీ పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజలు ఉద్యమాలకు సిద్ధమవుతారని శ్రీజ్యోతిభీమ్ భరత్ హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News