Tuesday, May 12, 2026

*ప్రతి రోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆధ్యాత్మికం, మానసిక, శారీరక ప్రయోజనాలు* – *ఎర్రగూడూరులో హనుమాన్ హోమం, ఉత్సవం నిర్వహణ* *రాయపాటి మురళీమోహన్ (బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు)*

నేటి సాక్షి పాములపాడు (మే-12):-ప్రతి రోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా మానసిక మరియు శారీరక ప్రయోజనాలు అనేకం కలుగుతాయని భక్తుల నమ్మకంమని బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ అన్నారు. నంద్యాల జిల్లా, పాములపాడు మండలంలోని, ఎర్రగూడూరు గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు, హోమం, ఉత్సవం నిర్వహించారు. మరియు రుద్రవరం గ్రామంలో ఉన్న దేవాలయంలో భక్తులు. భక్తిశ్రద్ధలతో శ్రీరాముని, హనుమంతుని జపిస్తూ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాములపాడు మండల బిజెపి అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసి, మాట్లాడుతూ ప్రతి రోజు ఆంజనేయస్వామిని  జపించడం వల్ల ధైర్యం, శక్తి, భక్తి పెరుగుతుందని, హనుమాన్ చాలీసాను చదవడం, శ్రీరామ జపాన్ని పాటించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రవరం బిజెపి ప్రవీణ్ కుమార్, కృష్ణా గౌడ్, హనుమాన్ భక్త బృందం అధ్యక్షులు లింగస్వామి, వడ్ల శంకర్ ఆచారి, జాల కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News