రాయికల్ లో సిఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నేటిసాక్షి, రాయికల్ : సకాలంలో రైతు భరోసా అందించిన రేవంత్ సర్కార్ తీరును హార్షిస్తూ రాయికల్ లో మంగళవారం రైతులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాయికల్ శివాజీ విగ్రహం వద్ద సిఎం రేవంత్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మన్కుమార్, మాజీ మంత్రి జీవన్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు. తమది రైతు ప్రభుత్వమని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేసారు.ఫోటో రైటప్: 24RKL05: పాలాభిషేకం చేస్తున్న దృశ్యం





