నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 24, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో గారి ముఖాముఖి సమావేశం: రాష్ట్రవ్యాప్తంగా రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటూ, వ్యవసాయ రంగంలో నూతన మార్గదర్శకత కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ప్రత్యక్షంగా ముఖాముఖి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రైతుల అనుభవాలు, సూచనలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. రైతుభరోస గురించి తమ అనుభవాలను, అభిప్రాయాలను గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో పంచుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రామకోటి,ఏ.పారశురాం, మరికల్ గ్రామ రైతులు ,మండల నాయకులు పాల్గొన్నారు.





