Tuesday, May 12, 2026

* రైలు టికెట్ తీసుకొని రైలులో ప్రయాణించిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

నేటి సాక్షి 12 ఏప్రిల్ నంద్యాల:-నంద్యాల రైల్వే స్టేషన్ లో రైలు టికెట్టు కొనుగోలు చేసి రైలులోని ప్రయాణికులతో కలిసి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, దక్షిణ మధ్య రైల్వే శాఖ గుంటూరు డి ఆర్ ఎం సుధేష్ణసేన్ కొద్ది దూరం ప్రయాణం చేశారు. మంగళవారం నంద్యాల రైల్వే స్టేషన్ లో పగటి పూట గుంతకల్లు – మార్కాపురం రోడ్డు నూతన రైలు ను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి, గుంటూరు రైల్వే డివిజనల్ డి ఆర్ ఎం సుధేష్ణసేన్ లు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రైలు టికెట్టు తీసుకొని ప్రయాణం చేయాలన్నారు.నంద్యాల రైల్వే స్టేషన్ కు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చేరుకోగానే రైల్వే అధికారులు సాంప్రదాయం పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ వద్ద ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి ఫ్లాట్ ఫామ్ టికెట్ కొని రైల్వే స్టేషన్ లోకి అడుగుపెట్టారు. నూతన రైలు ప్రారంభ సభ అనంతరం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, రైల్వే అధికారులు స్టేషన్ లోని ఒకటవ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చిన గుంతకల్లు – మార్కాపురం నూతన ఫ్యాసింజర్ రైలుకు జెండా ఊపి ప్రారంభించి కొత్త రైలులో స్టేషన్ నుంచి నూనెపల్లె వరకు ప్రయాణికులతో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రయాణం చేసి వారి నుంచి సమాచారం అడిగారు. కొత్త రైలు పగటి పూట ఎంతో మేలు జరుగుతుందని మహిళా రైలు ప్రయాణికులు వివరించారు. కొత్త రైలు సాధించిన మీకు ధన్యవాదములు అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News