నేటి సాక్షి నారాయణపేట మే 5,( రిపోర్టర్ ఇమామ్ సాబ్), మరికల్ మండల తహసీల్దార్ వినతి పత్రం….. నారాయణ పేట జిల్లా మరికల్ మండల పరిధిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ఇంకా మండలంలో చాలా గ్రామాల్లో గన్ని బ్యాగులు మరియు లారీల కొరత ఉన్నందున రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజుల తరబడి దాన్యం కుప్పల వద్ద కాపు కాసి అలసి రైతులు కుప్పకూలుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు ఇదేవిధంగా కొనసాగితే కొద్ది రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున రైతులు ఆందోళన చేయవలసి వస్తుందని ముందస్తు తెలియజేస్తున్నాము. అనంతరం తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో డీ టీ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లంబాడి తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శి కృష్ణ రెడ్డి,వార్డు సభ్యులు లక్కాకుల శివ కుమార్,సీమ నర్సింహా,మాజీ వైస్ ఎంపీపీ రవికుమార్ యాదవ్,వెంకటేష్ గౌడ్, విష్ణు కాంత్ రెడ్డి, నర్సిములు, గౌడ్,ప్రవీణ్ కుమార్,రాఘవేంద్ర,హన్మంతు,కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.





