Wednesday, February 25, 2026

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన సదస్సు. వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వర్ణకుమారి.

నేటి సాక్షి వికారాబాద్:జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి .స్వర్ణ కుమారి గారి అధ్యక్షతన సిపిర్ (కార్డియో పల్మనరీ రిసాసిటిషన్) చేసే విధానం గురించి జిల్లాలో రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం లో పనిచేస్తున్న 10 బృందాలలోని వైద్యులు సిబ్బందికి సిపిర్ చేసే విధానం గురించి వివరించి ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ వరలక్ష్మి వైద్యాధికారి డాక్టర్ రోహిత్ మ్యాన్ క్వీన్ టాయ్ ను ఉపయోగించి సిపిర్ చేసే విధానం గురించి డిమాంస్ట్రేషన్ చేయడం జరిగినది. అనంతరం ఆర్ బీ ఎస్ కే వైద్యుల చేత సి పి ఆర్ డేమానిస్ట్రేషన్ చేయించడం జరిగినది . ఈ సందర్భంగా డి ఏం ఏచ్ ఓ మాట్లాడుతూ హార్ట్ ఎటాక్ వంటి అత్యవసర పరిస్థితులలో తక్షణ స్పందనగా పక్కనున్నవారు సిపిఆర్ విధానం ద్వారా గుండె పనితీరును కొంతమేర సాధారణ స్థితికి తీసుకు రావచ్చని చాలా సందర్భాలలో రోగికి తక్షణ వైద్య సహాయం అందే వరకు ప్రాణాలు కాపాడేందుకు చేసే ప్రయత్నం. ఇలా సిపిఆర్ చేసే ప్రయత్నాల వలన 10 శాతం హార్ట్ ఎటాక్ కేసులను ప్రాణాపాయం నుండి కాపాడవచ్చు అని తెలిపారు. ఈ సిపిర్ పై అవగాహన అన్నిప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. హార్ట్ ఎటాక్ వంటి అత్యవసర పరిస్థితులు ఎవరికైనా రావచ్చని కాబట్టి ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించి అవగాహన ఏర్పరచు కోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో వి శ్రీనివాసులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News