Wednesday, April 22, 2026

*శంకర్‌పల్లిలో ఇంద్రారెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహణ**బీఆర్ఎస్ నేతలు శశిధర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు*

నేటి సాక్షి*శంకర్‌పల్లి, ఏప్రిల్ 22: సుధాకర్ గౌడ్ శంకర్‌పల్లిలో స్వర్గీయ మాజీ మంత్రివర్యులు పట్లోళ్ల ఇంద్రారెడ్డి గారి వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.బీఆర్ఎస్ పార్టీ శంకర్‌పల్లి మున్సిపల్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ శంకర్‌పల్లి మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ముందుగా నేతలు ఇంద్రారెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను, ప్రజలకు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి తెలంగాణ అభివృద్ధికి ఇంద్రారెడ్డి గారు ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, యువజన విభాగం సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News