Wednesday, May 6, 2026

సహకార బ్యాంకు మేనేజర్ రవి గారికి ఘన సన్మానం

నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్(ఎండి ముబీన్): ఆసిఫాబాద్ తాలూకా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సహకార బ్యాంకు మేనేజర్ రవి గారిని ఘనంగా సన్మానించారు. బ్యాంకింగ్ రంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ సన్మానం నిర్వహించినట్లు సంఘం నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు గాజుల జక్కయ్య పటేల్ మాట్లాడుతూ, రవి గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు గజ్జెల వినోద్ పటేల్, తిరుపతి, వెంకటేష్, ప్రహ్లాద్, శంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News