Friday, April 17, 2026

*నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం** రాజారాంపల్లి సెక్షన్ పరిధిలో మరమ్మత్తులు*

నేటి సాక్షి, ఎండపల్లి:* మండల పరిధిలోని పాతగూడూరు, గుల్లకోట విద్యుత్ సబ్‌స్టేషన్లలో మరమ్మత్తుల దృష్ట్యా నేడు (ఏప్రిల్ 18, శనివారం) విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఏఈ బండి సమ్మయ్య ప్రకటన ద్వారా తెలిపారు. గుల్లకోట, చర్లపల్లి, కొండాపూర్ గ్రామాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు. అదే విధంగా పాతగూడూరు, సూరారం, రాజారాంపల్లి గ్రామాల్లో మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. మరమ్మత్తుల పనులు సజావుగా కొనసాగేందుకు గ్రామాల విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ రాజారాంపల్లి సెక్షన్ తరఫున ఏఈ విజ్ఞప్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News