నేటి సాక్షి, కోరుట్ల అర్బన్ (విఆర్ ధర్మేంద్ర):-కెసిఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వేధింపులకు నిరసనగా కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది, ర్యాలీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ను సిట్టు విచారణకు పిలవడం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రాజకీయ కక్ష సాధింపు చర్య అని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిచిన కేసీఆర్ ప్రజాదరణ తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిరంకుశ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందన్నారు, తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరని తగిన సమయంలో కాంగ్రెస్కు గట్టి బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు

