Monday, December 23, 2024

కరోనా కంటే డేంజర్​

  • కొత్త వైరస్​ను సృష్టించిన చైనా
  • మూడు రోజుల్లోనే మనిషి ఖతం

చైనాలో మరో కొత్త వైరస్​ను సృష్టించింది. కరోనా కంటే డేంజర్​ వైరస్​ ఇది. చైనా సైంటిస్టులు దీనిని తయారు చేయగా, ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. హెబెయ్ మెడికల్ యూనివర్సిటీ సైంటిస్టులు సృష్టించిన ఆ సింథటిక్​ వైరస్​ పేరే ‘వెసిక్యులర్ స్టొమాటైటిస్’. ఇది శరీరంలోకి వెళ్లిన మూడు రోజుల్లోనే ప్రాణాలు తీసేస్తుంది. ఇది ఎబోలా వైరస్‌లా ఉంటుంది. దాని జన్యుక్రమాన్ని అంచనా వేసేందుకు ఈ వైరస్​కు ప్రాణం పోశారు. ఈ వైరస్​ ను ఎలుకలపై ప్రయోగించగా, లోపలి అవయవాలు ఫెయిల్​ అయ్యి, మూడు రోజుల్లోనే ఎలుకలు చనిపోయాయి. ఎబోలా వైరస్​ నివారణకే ఈ వైరస్​ను సృష్టించినట్టు తెలుస్తున్నది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News