Monday, December 23, 2024

చిట్​ ఫండ్​ డబ్బులు ఇవ్వని వైనం..

నేటి సాక్షి, కరీంనగర్​ క్రైం: గడువు ముగిసినా చిట్ మొత్తం చెల్లించకపోగా, సభ్యురాలిని బెదిరింపులకు గురిచేసిన కనకదుర్గ చిట్​ఫండ్​ చైర్మన్​ రాగిడి తిరుపతిరెడ్డితో పాటు అతని అనుచరుడు రాజుపై కేసు నమోదు చేసినట్టు కరీంనగర్ టూ టౌన్ ఇన్​స్పెక్టర్​ విజయకుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా గీతానగర్​కు చెందిన ప్రస్తుతం కరీంనగర్ సుభాష్​నగర్​లో నివాసముంటున్న గడ్డం జమున(40) అనే మహిళ కరీంనగర్​లోని ఐబీ చౌరస్తాలో ఉన్న కనకదుర్గ చిట్ ఫండ్​లో చిట్​కు సంబంధించి పూర్తి మొత్తం రూ.3 లక్షలు చెల్లించింది. చిట్​కు సంబంధించి తనకు రావాల్సిన మొత్తాన్ని అడుగగా, హనుమకొండ జిల్లా గోపాలాపూర్​కు చెందిన రాగిడి తిరుపతయ్య @ తిరుపతిరెడ్డి, అతని అనుచరుడు రాజు రెండు ఖాళీ బ్యాంకు చెక్కులు లు అందచేశారు. ఖాతాలో సరిపడా డబ్బు లేకపోవడంతో బ్యాంకు వారు చెక్కును తిరస్కరించారు. దీని గురించి బాధితురాలు చైర్మన్​ తిరుపతిరెడ్డిని అడుగగా, డబ్బులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పాడు. మరోసారి డబ్బులు అడిగితే చంపేస్తామని తిరుపతి రెడ్డి బెదిరింపులకు గురిచేశాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ ఇన్​స్పెక్టర్​ విజయ్ కుమార్ కేసు నమోదు చేసి, విచారణ అనంతరం తిరుపతిరెడ్డిపై ఐపీసీ సెక్షన్స్ 420, 406, 506 రెడ్ విత్ 34, తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్-5 ప్రకారం కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరు పర్చి, రిమాండ్​కు తరలించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News