నేటి సాక్షి, రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి వ్యాపారవేత్త శిశువర్దన్రెడ్డిపై రాయలసీమ గ్యాంగ్ దాడి చేసి, కారులో బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారు. ఈ ఘటనపై వ్యాపారవేత్త కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు వ్యాపారవేత్తను తరలిస్తుండగా, మహబూబ్‌నగర్ జిల్లా వద్ద నిందితులను పోలీసులు పట్టుకున్నారు. శిశువర్ధన్రెడ్డిని కాపాడారు. ఆర్థిక లావాదేవీల మూలంగానే కిడ్నాప్ జరిగినట్టు తెలుస్తున్నది.