Friday, March 6, 2026

కిక్.. కిక్కు.!!————– తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు

*సామాన్యుడికి ‘సర్కారు-కిక్’*

సర్కారు జేబుకి ‘ఆదాయపు-కిక్కు

నేటి సాక్షి – తెలంగాణ(బ్యూరో ఇంఛార్జి)( రాధారపు నర్సయ్య )సామాన్యుడు..ఇక ‘కిక్కు’రుమనకుండా..సర్కారు జేబుకి ‘ఆదాయపు-కిక్కు’ ఎక్కించే పనిలో పడతాడు..తనకలవాటైన ‘నిషా’లో.!తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. క్వార్టర్​ బాటిల్​ మద్యానికి రూ.10, హాఫ్​, ఫుల్​ బాటిళ్లపై రూ.20, 40 చొప్పున పెంచుతూ తెలంగాణ బెవరేజెస్​ కార్పొరేషన్ లిమిటెడ్​ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు అప్పుడే అమల్లోకి వచ్చేశాయి. డిపోలతో పాటు మద్యం దుకాణాలకు సర్క్యూలర్లు జారీ చేసింది. బ్రూవరీల యాజమాన్యాల డిమాండ్ల మేరకు సర్కార్​ నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా గత ఫిబ్రవరిలో బీర్ల ధరలను పెంచింది. ఇదే క్రమంలో ఇప్పుడు మద్యం ధరలను పెంచింది. జస్టిస్‌ జైశ్వాల్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా బీర్ల ధరలపై 15 శాతం పెంచుతూ ఫిబ్రవరి 11న సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. 2019 నుంచి రాష్ట్రంలో బీర్ల ధరలు పెరగలేదు. ముడి పదార్ధాల రేట్లు పెరిగినా, అప్పటి ధరతోనే బ్రూవరీస్‌ కంపెనీలు సరఫరా చేస్తూ వచ్చాయి. వివిధ సంప్రదారులు, బేవరేజెస్ కంపెనీల విజ్ఞప్తుల మేరకు ఒక్కో బీరు బాటిల్‌పై కనీసం రూ.18 నుంచి గరిష్ఠంగా రూ.50 వరకు పెంచుతూ ప్రభుత్వం నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా గత ఫిబ్రవరిలో బీర్ల ధరలను పెంచింది ఇదే క్రమంలో ఇప్పుడు మద్యం ధరలను పెంచింది._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News