Friday, March 6, 2026

‘అపూర్వ’ సమ్మేళనం

నేటి సాక్షి,వేమనపల్లి: వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల2006–07బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.అప్పటి మిత్రులంతా ఆ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు.ఒకే చోట చదువుకున్న మిత్రులు పదో తరగతి,ఆపై చదువులు పూర్తయ్యాక..వివిధ హోదాల్లో ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా 18 ఏళ్ల తరువాత మళ్ళీ చదువులమ్మ ఒడిలో కలుసుకున్నారు.ఆత్మీయ పలకరింపులు,అలింగనాల నడుమ నాటి చిలిపి అల్లరిచేష్టలు,మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు.వారు చదువుకున్న తరగతి గదుల్లో కూర్చొని ఒక్కసారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.నాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించి జ్ఞాపకలను అందజేశారు.రోజంతా ఉల్లాసంగా గడిపారు.ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు రాజ్ కుమార్,శ్రీనివాస్ రెడ్డి,రవీందర్ రెడ్డి,మొగలి,శిరీష్, గీత,మధు,లక్ష్మీ నివాస్, రాజు,పాఠశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News