నేటి సాక్షి, కోదాడ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కీలక పాత్ర పోషించిందని టి యు డబ్ల్యూ జె 143 జిల్లా ప్రధాన కార్యదర్శి నారపరాజు హరికిషన్ రావు నియోజకవర్గ అధ్యక్షుడు వంగవీటి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఆదివారం కోదాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 31న హైదరాబాదులో నిర్వహించనున్న టీజేఎఫ్ రజితోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా వారు మాట్లాడారు. టీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నారాయణ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం బలహీనమైన ప్రతి సందర్భంలోనూ టీజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సజీవంగా ఉంచేందుకు సముచిత పాత్ర పోషించింది అన్నారు.. రాష్ట్ర ఆవిర్భావం కోసం అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి న ఘనత టీజేఎఫ్ కు దక్కుతుందన్నారు.. రజితొచ్చా వేడుకలను విజయవంతం చేయాలని వారు జర్నలిస్టులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో…టీయూడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంక వెంకటరత్నం, యూనియన్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొలిచలం నరేష్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపాటి సురేష్ ,రూరల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జూలూరి వీరభద్రం అనంతగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిమెట్ల రామకృష్ణ శివదాసు శ్రీహరి, నాయిని మల్లయ్య, ఆలూరి చరణ్ ,వేజెండ్ల శివనాగు, తునిగర్ సైదులు, నేలమరి శ్రీకాంత్, చలిగంటి రంగా, శ్రీరామ్ రవికుమార్ ,గంగిరెడ్డి అశోక్ రెడ్డి, గడ్డం అంజి అమరబోయిన వీరబాబు ఉన్నారు.





