నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : కేటి దొడ్డి మండల పరిధిలోని నందిన్నె గ్రామంలో సి ఆర్ పి ఎఫ్ మదర్స్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం నందిన్నె గ్రామంలో 2025-2026 విద్య సంవత్సరానికి అవసరమైన ఉపాధ్యాయులను తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు సీఎం రేవంత్ రెడ్డి ఈ విద్య సంవత్సరానికి అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలి అనే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సి ఆర్ పి ఎఫ్ కన్వీనర్ వీరన్న మాట్లాడుతూ : కేటి దొడ్డి మండల పరిధిలోని చుట్టూ పక్కల గ్రామాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలలో చాలా చోట్ల ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నది అని అన్నారు అదే విదంగా నందిన్నె ఎంపీపీ ఎస్ పాఠశాలల్లో 358 విద్యార్థులు ఉన్నారు పాఠశాలలో చదువు చెప్పడానికి పదిమంది ఉపాధ్యాయులు అవసరం ఉన్నది కానీ 7 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు ఇంకా ముగ్గురు ఉపాధ్యాయుల అవసరం ఉన్నది విద్యార్థులకు బోధించడానికి సరైన టైమింగ్స్ సరిపోవడం లేదు అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులను సీఎం రేవంత్ రెడ్డి చదువుపై శ్రద్ధ తీసుకొని భవిష్యత్తు కోసం అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా నందిన్నె జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో 571 విద్యార్థులు ఉన్నారు విద్యార్థులకు చదువులు బోధించడానికి 21 మంది ఉపాధ్యాయులు అవసరం ఉన్నది కానీ 22 మంది ఉపాధ్యాయులు మాత్రమే 571 విద్యార్థులకు బోధిస్తున్నారు అన్ని సబ్జెక్టులకు కలుపుకొని 9 మంది ఉపాధ్యాయులను నియమించాల్సి ఉన్నది అని అన్నారు కావునా ప్రభుత్వం ఎలాగైనా ఈ విద్య సంవత్సరానికి అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలి అని ఈ సందర్భంగా ఈరన్న కోరారు.
సి ఆర్ పి ఎఫ్ కో కన్వీనర్ వెంకటేశ్వరెడ్డి, సభ్యులు రాఘవేంద్ర యుగంధర్ నాయుడు, స్వామి, యూత్ అధ్యక్షుడు నగేష్, ఉపాధ్యక్షుడు మహాదేవు,మథర్స్ కన్వీనర్ రాధమ్మ, తల్లిదండ్రులు పాల్గొన్నారు

