ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గర రైతులపై జరిగిన దాడి హేయమైన చర్య…
-ఈ దాడిని నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం..
ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం రద్దు చేయకపోతే….
– త్వరలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధం…
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా: రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామములో నిర్మిస్తున్న విషపూరిత ఇథనాల్ ఫ్యాక్టరీ ఆపాలని ప్రజలకు వ్యతిరేకంగా నిర్మించాలనుకున్న ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని NHPS జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఎక్కడో పట్టణాల్లో ప్రముఖుల దగ్గర ఉండే బౌన్సర్లని మారుమూల ప్రాంతమైన ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గరకు యాజమాన్యం ఎందుకు తీసుకువచ్చిందని ఇది ప్రజలకు అనేక రకమైన వ్యాధులతో పాటు ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. పెద్ద ధన్వాడ లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని ముట్టడిస్తారనే ఉద్దేశ్యంతో వారి నివాసంలోని గద్వాల టౌన్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి గద్వాల టౌన్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరని NHPS జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గర బుధవారం జరిగిన దాడిలో ఓ దళిత మహిళల తీవ్రంగా గాయపడిందని, ఒక మహిళతో పాటు పలువురికి గాయాలు అయ్యాయని ఘర్షణ వాతావరణాన్ని నెలకొల్పే విధంగా చేస్తున్న యాజమాన్యాన్ని ప్రైవేట్ సైన్యాన్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలని రాత్రికి రాత్రే మిషన్లను, కంటైనర్లను తీసుకువచ్చి ఒక యుద్ధ వాతావరణం కల్పించడం దానికి పోలీసులు వత్తాసు పలకడం సమంజసంగా లేదని పోలీసులు ప్రజలకు మద్దతునిస్తున్నారా యాజమాన్యానికి మద్దతునిస్తున్నారా గతంలో ప్రజా ప్రతినిధులు ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకించారని ముఖ్యంగా సంపత్ గారు గతంలో జరిగిన దీక్షలను విరమిస్తూ ఫ్యాక్టరీ నిర్మించకుండగా తాను చూసుకుంటానని ఆ బాధ్యత తనదే అని ప్రజల కు హామీ ఇవ్వడం జరిగిందని ఈ హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నాo.
ముఖ్యంగా రెవెన్యూ అధికారులు పదేపదే ప్రజల్ని ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నాల్ని విరమించుకొని ఈ ప్రాంతం నుండి విషపూరితమైన కర్మగారాన్ని ఎత్తివేయడానికి కృషి చేయాలని ఆ దిశగా అధికారుల ప్రయత్నాలు జరగకుండా ప్రజలపై ఒత్తిడి తీసుకురావడం అన్యాయమని వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకొని పనులను ఆపి వచ్చిన ప్రైవేటు సైన్యాన్ని బైండోవర్ చేసుకోవాలని జిల్లా ఎస్పీ జోక్యం చేసుకొని అక్కడికి వచ్చిన బౌన్సర్లను వెంటనే వెనక్కి పంపాలని ప్రజల మద్దతు లేకుండా చేస్తున్న ఈ దుర్మార్గమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ ప్రజల తరఫున ప్రభుత్వాలు పనిచేయాలని ధనవంతుల తరఫున పనిచేయటం మానుకోవాలని రాజకీయ మద్దతు లేకుండా యాజమాన్యం ఇంతటి దౌర్జన్యానికి ఒడిగట్టలేదని వెంటనే అక్కడ నిర్మాణాలని జరపకుండా జిల్లా యంత్రాంగం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒక వైపు రైతులకు మేలు చేస్తామని చెబుతూనే లో లోపల ఇలాంటి దారుణానికి పాల్పడటం అన్యాయమని అన్నారు. రియల్ ఎస్టేట్, వాణిజ్య వ్యాపారాల కోసం భారీ మొత్తంలో పొలాలు కొనుగోలు చేయడంతో రాను రాను వ్యవసాయ ఇతర పంటలు పొలాలు సాగుబడి తగ్గిపోయి, తినడానికి భారీ మొత్తంలో డబ్బు వెచ్చించే ధాన్యం కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపారిస్తుందని వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం రద్దు చేయకపోతే త్వరలోనే నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు.





