నేటి సాక్షి,గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరువరం మండలం లోని చీమలకుంటపల్లి లో బుధవారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుల్ల మద్య ఊరెగింపుగా పోచమ్మ ఆలయానికి తరలి వచ్చారు. పోచమ్మ తల్లి కి నైవేద్యం సమర్పించి, ఒడిబియ్యం మొక్కులు చెల్లించుకున్నారు.పంటలు పండాలని,పిల్లా పాపలు, అందరినీ చల్లంగా చూడాలని వేడుకున్నారు. మున్నూరు కాపు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





