Friday, March 13, 2026

గురుకులాల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వండి

నేటి సాక్షి, మెట్ పల్లి

ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ఇవ్వాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను స్టేట్ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి లు మంగళవారం హైదరాబాద్ లో కలిసి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ. నెం. రెండు వందల ఐదు ప్రకారం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయాలని వారు కోరారు. గల్ఫ్ బాధితుల పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News