నేటి సాక్షి తొగుట .. వడ్డే నరసింహులుతోగుట పరిధిలో రైతు పేరు. సీత బాలయ్య గ్రామం & మండలం తోగుట జిల్లా. సిద్దిపేట లో సిరి సీడ్స్ వారి ఆధ్వర్యంలో రైతు క్షేత్రస్థాయి ప్రదర్శన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని పంట పరిస్థితులను పరిశీలించారు.ఈ సందర్భంగా సిరి సూపర్ 66 (పరిశోధిత వరి) విత్తనం ప్రత్యేకతలను వివరించారు. అధిక దిగుబడి, మంచి గింజ నాణ్యత, బలమైన మొక్క నిర్మాణం ఈ రకానికి ప్రధాన లక్షణాలుగా పేర్కొన్నారు. అదనంగా, ఈ విత్తనం BLB (బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్) మరియు మెడ విరుపు (నెక్ బ్లాస్ట్) రోగాలను తట్టుకునే శక్తి కలిగి ఉందని తెలిపారు.కార్యక్రమంలో మాట్లాడిన ఉమ్మడి మెదక్ ఏరియా మేనేజర్ శ్రీ బెజుగామ ఆంజనేయులు మాట్లాడుతూ, సిరి సీడ్స్ వారు అభివృద్ధి చేసిన ఈ వరి రకం ఖరీఫ్ మరియు రబీ రెండు సీజన్లకు అనుకూలమని చెప్పారు. ఈ రకం పంట కాలం సుమారు 120–125 రోజులు ఉండగా, ఎకరానికి దాదాపు 35–40 క్వింటల పైగా దిగుబడి పొందవచ్చని వివరించారు.





