నేటి సాక్షి, పరిగి.(సురేష్ మోత్కూర్.)మంగళవారం హనుమంగండి తండాలో తుల్జా భవాని అమ్మవారి పూజ సందర్భంగా, సేవలాల్ మహారాజ్ మరియు అంబ భవాని గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడినవి. ఈ పుణ్య కార్యక్రమంలో తండా ప్రజలు, బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మహిమగొలిపారు. పండుగ ఆ గ్రామంలో కలిసిమెలిసి యువకులు పెద్దలు జరుపుకున్నారు. తమ ఇష్ట దైవమైన దేవుళ్ళ పండుగలు జరుపుకోవడం మా సంప్రదాయమని తండావాసులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ కమల్ హాజరై, ప్రజలతో కలిసి పూజల్లో పాల్గొని కార్యక్రమానికి మరింత గౌరవాన్ని చేకూర్చారు. స్థానిక ప్రజల ఐక్యత, భక్తి భావం ఈ వేడుకను విజయవంతంగా నిలిపాయి. ఈ కార్యక్రమంలో తండా వాసులందరూ పాల్గొన్నారు.





