నేటి సాక్షి -మేడిపెల్లి దుమాల అనీల్ జూన్ 10
ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కి,ఆదేశాల మేరకు మేడిపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి కి, ఆద్వర్యంలో మేడిపెల్లి మండల కేంద్రంలో మర్రిపెల్లి లింగం గౌడ్, (16500), అర్మురి సంజన, (15000), గోపు రాజు, (60000), పెద్దవేన్ని రాజేష్,(29000) రూపాయలు సీఎం సహాయనిధి చెక్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు చెక్కులను అందించారు.ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఆర్థిక సహాయం అందించడానికి కృషి చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కి,మేడిపెల్లి మండల అద్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డికి, అలాగే స్థానిక నాయకులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బలగం రాజేష్,మాజీ సర్పంచ్ ఉరుమడ్ల నర్సయ్య ,మండల యూత్ ప్రధాన కార్యదర్శి మార్గం నవీన్, సీనియర్ నాయకులు గోపు రాజిరెడ్డి, వేములవాడ మధుకర్,తోట రాజేందర్, బొడ్డుపల్లి చందు, దుమాల ప్రవీణ్, కుందారపు వినోద్, సాల్మన్,అంతడుపుల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

