Thursday, April 23, 2026

.*వాసవి మాత జయంతిని అధికారికంగా ప్రకటించడం హర్షనీయం* .*వైశ్యులంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు* .*వికారాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు పాలాది శ్రీనివాస్ గుప్తా.*

నేటి సాక్షి, పరిగి( సురేష్ మోత్కూర్.)ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం ఎంతో హర్షనీయమైన విషయమని, వికారాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు పాలాది శ్రీనివాస్ అన్నారు. గురువారం నాడు ఆయన మాట్లాడుతూ….. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏర్పాటు చేశారని, అదేవిధంగా శ్రీ వాసవి మాత జయంతిని ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అమ్మవారి జయంతిని నిర్వహించేందుకు అధికారిక ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అందుకు సహకరించి, ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తున్న పరిగి ఎమ్మెల్యే ప్రియతమ నాయకులు డాక్టర్ టీ. రామ్మోహన్ రెడ్డికి రాష్ట్ర ఆర్యవైశ్యుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్యవైశ్యులంతా ఎల్లప్పుడూ కాంగ్రెస్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైశ్యులకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News