నేటి సాక్షి నారాయణపేట, జూన్ 11, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని గున్ముక్ల గ్రామంలో స్వయంభూ శ్రీ కడపరాయ స్వామి క్షేత్రంలో శివాలయ పునఃనిర్మాణ భాగంలో గౌడ సంఘం నేతలు మూడు లక్షల రూపాయల విరాళాన్నీ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బాలయ్య గౌడ్, నర్సింహా రెడ్డి, సుతారి నర్సిములు, తిమ్మయ్య, గౌడ సంఘం అధ్యక్షులు గణేష్ గౌడ్, ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్, కృష్ణయ్య గౌడ్, రాజేందర్ గౌడ్, నాగేశ్వర్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్, నాగరాజు గౌడ్, కాశీమన్న గౌడ్, నర్సిములు, బాబు, గోపాల్ గౌడ్, రఘు గౌడ్, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

