Tuesday, January 20, 2026

భూమి పట్టా చేయిస్తానని.దళితున్ని మోసం చేసిన టీజేఎస్ అధ్యక్షులునా డబ్బులు ఇప్పించండంటూ బుగ్గారం రాయలింగు కలెక్టర్ కు పిర్యాదు..

నేటి సాక్షి – భూమి పట్టా చేయిస్తానని.దళితున్ని మోసం చేసిన టీజేఎస్ అధ్యక్షులునా డబ్బులు ఇప్పించండంటూ బుగ్గారం రాయలింగు కలెక్టర్ కు పిర్యాదు.. జిల్లా స్టాఫర్* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా జనసమితి పేరు చెప్పి, ఇష్టం వచ్చినట్టు కులం పేరుతో దుశిస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్న చుక్క గంగారెడ్డి పై చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన దళితుడైన నక్క రాయలింగు జిల్లా కలెక్టర్ కు గురువారం పిర్యాదు చేశారు.భూమి పట్టాచేయిస్తున్నానని దళితుడి దగ్గర డబ్బులు తీసుకుని పట్టా చేయించక తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు, వీడిసి ఎండిసి అధ్యక్షుడు చుక్క గంగారెడి మోసం చేశాడని నక్క రాయలింగు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.నక్క రాయలింగు తెలిపిన వివరాల ప్రకారం…బుగ్గారం గ్రామంలో నాకు కొంతవ్యవసాయ భూమి ఉండగా అది ధరణిలో పట్టా కాలేదు పట్టా కొరకు మా గ్రామానికి చెందిన తెలంగాణ జన సమితిపార్టీ జిల్లా అధ్యక్షుడు, సినియర్ జర్నలిస్టు చుక్క గగారెడ్డి ని ఈవిషయంలో ఏదైనా సహాయం చేయగలరని అడిగాను. దానితో గంగారెడ్డి స్పందించి పటా కోసం రూ.1. 20లక్షలు ఖరవుతాయని,ఇట్టి డబ్బులు ఆఫీసర్లకు ఖర్చవుతాయని అందులో అధికారులకు ఇవ్వాలని ముందుగా 50 వేలు ఇవ్వాలని అడుగగా అట్టి 50 వేలు ఇచ్చానని తెలిపారు.ఆరు నెలలు గడుస్తున్నా ఎటువంటి పని కాలేదని, దాంతో నేను నా డబ్బులు నాకు ఇవ్వాలని అడిగితే నన్ను కులం పేరుతో దూషిస్తూ ఇష్టం ఉన్నటు మాటాడుతున్నాడని కలెక్టర్ కు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు.ఇంకా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఎక్కడకెళ్ళి చెప్పుకుంటావో చెప్పుకో అని గంగారెడ్డి బెదిరిస్తున్నాడని, ఈవిషయం బుగ్గరంలో ఎవరికి చెప్పినా ఆయన జోలికి ఎవరు పోవట్లేదని,అడగడం లేదని తుదకు మీకు నా బాధ తెలియజేస్తున్నానని రాయలింగు చెప్పుకొచ్చారు. నేను ముందుకెళ్ళి అడుగుతే నన్ను కులం పేరుతో దూషిస్తున్నాడని పేర్కొన్నారు.నేను విలేకరిని నన్ను ఎవ్వరూ ఏం చేయలేరంటూ నీ దిక్కున చోట చెప్పుకొ అంటు బెదిరిస్తున్నాడనీ వాపోయారు.నాకు నలుగురు కూతుర్లు, ఆర్థికంగా వెనకబడ్డ పరిస్థితి ఉందని, దయచేసి నా డబ్బులు నాకు ఇప్పించి ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాయాలింగు కలెక్టర్ ను కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News